అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న హైవేపై లారీ, ఐచర్ వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇరు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు. రెండు వాహనాలు వేగంగా గుద్దుకున్నందున డ్రైవర్లు వాహనాల్లోనే ఇరుక్కుపోయారు. 108 సిబ్బంది, స్థానికులు, పోలీసులు దాదాపు అరగంటకు పైగా కష్టపడి ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి 108 సహాయంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకై అనంతపురం తరలించారు.
లారీ, ఐచర్ ఢీ... ఇద్దరి పరిస్థితి విషమం - lorry
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని హైవేపై లారీ, ఐచర్ వాహనాలు ఢీకొన్నాయి. బలంగా గుద్దుకోవడం వల్ల ఇరు వాహనాల డ్రైవర్లు ఇరుక్కుపోయారు. దాదాపు అరగంటకుపైగా కష్టపడి ఇరుక్కున్నవారిని బయటకి తీశారు. గాయపడిన ఇద్దరినీ 108 సహాయంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.