అనంతపురం జిల్లాలోని పలు పట్టణాల్లో లాక్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా పోలీసులు తగు చర్యలు చేపట్టారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ అనంతపురం జిల్లా కదిరిలో కొనసాగుతోంది. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. రోడ్డుపైకి వచ్చిన వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలు స్వాధీనం చేసుకోవడమే కాక.. జరిమానాలు విధిస్తున్నారు.
ఆరోగ్య శాఖ, మున్సిపల్ ఇతర శాఖల అధికారులు పారిశుద్ధ్య చర్యలు మెరుగుపరుస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి రక్త నమూనాలు సేకరించి సుమారు 42మందికి పరీక్షలు పూర్తి చేశారు. ఉదయం 6:30 గంటల నుంచి 7:30 వరకు నిత్యవసర వస్తువుల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. పట్టణంలో మూడు చోట్ల కూరగాయలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే లాఠీ దెబ్బలే
లాక్డౌన్ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో బయటకి ఎవరైనా వస్తే పోలీలుసు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు లాఠీ ఝుళిపిస్తున్నారు.
ఇదీ చూడండి: