నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన స్థానికులు,పోలీసులు అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన సాయితేజ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై ఉల్లికళ్ళు గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పెద్దపప్పురు మండలం జూటూరు గ్రామ సమీపంలోని పెన్నానది వద్దకు రాగానే .. యువకుడు వంతెనదాటే క్రమంలో నీటి ప్రవాహనికి ద్విచక్ర వాహనంతో సహా నదిలో కొట్టుకుపోయాడు. కొద్ది దూరం వెళ్ళగానే నదిలోని చెట్టుని పట్టుకుని సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. గమనించిన స్థానికులు, పోలీసులకు సమాచారం అందించారు. తాళ్ల సాయంతో సాయి తేజను సురక్షితంగా పెన్నా నది నుంచి బయటకు తీశారు.ఇదీ చదవండి: ఆశాజనకంగా కాఫీ.. హుద్‌హుద్ తర్వాత ఈ ఏడాది అధిక దిగుబడులు