అనంతపురం జిల్లాలో మద్యం దుకాణాల వద్ద మందుబాబులు క్యూ కట్టారు. కొన్నిచోట్ల దుకాణాలు తెరిచినప్పటికీ పెరిగిన మద్యం ధరలు అప్డేట్ కాకపోవటంతో అమ్మకాలు ఆలస్యమయ్యాయి. జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాక మాత్రమే దుకాణాలు తెరుస్తామని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు బుక్కరాయసముద్రంతో పాటు ఇతర గ్రామీణ ప్రాంతాల్లో దుకాణాలు 11 గంటల తర్వాత తెరుచుకున్నాయి.
అనంతలో తెరుచుకోని మద్యం దుకాణాలు
అనంతలో మాత్రం మద్యం దుకాణాలను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. అనంతపురం రెడ్‌జోన్ పరిధిలో ఉండటంతో పాటు కంటైన్మెంట్ ప్రాంతాల్లో మద్యం విక్రయించవద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు దుకాణాలు మూసివేయిస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: