ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి గాంచిన అనంతపురం జిల్లాలోని లేపాక్షి దేవాలయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురాతన వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. 2018లో జరిగిన లేపాక్షి ఉత్సవాల సమయంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఆలయం చుట్టుపక్కలా అభివృద్ధి చేశారు. కొండపై నిర్మితమైన ఈ ఆలయ ప్రాంగణంలో వర్షం నీరు నిల్వ ఉండి నాచు పట్టింది. ఆలయానికి చెందిన కోనేరుకు నిర్వహణ లేక అందులో చెత్త పేరుకుపోతోంది. కోనేరులోని మండపం చెత్త, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం పండుగల సీజన్ కావటంతో భక్తులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఘన చరిత్ర గల ఈ ఆలయాన్ని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇదీ చూడండి: Actor died: టాలీవుడ్ నటుడు రాజబాబు మృతి