ETV Bharat / state

'నూతన వ్యవసాయ చట్టలతో రైతులకు నష్టం' - Left parties protests against the Center in Anantapur district

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలతో సొంత భూముల్లోనే రైతులు కూలీలుగా పని చేసే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. తక్షణం వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Left parties leaders Rastaroko
వామపక్ష నేతలు రాస్తారోకో
author img

By

Published : Dec 4, 2020, 3:36 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో రాస్తారోకో చేపట్టారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు వాళ్ల సొంత భూముల్లో కూలీలుగా పని చేసే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు.

రైతులను మోసం చేసే విధానాలను కేంద్రం వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్నారు. ట్రాఫిక్​కు అంతరాయం కలగడం వల్ల స్థానిక పోలీసులు నేతలను బలవంతంగా స్టేషన్​కు తరలించారు.

ఇదీ చదవండి:

'అరోగ్యశ్రీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.