అనంతపురం జిల్లా కుందుర్పి మండలం మహంతపురం గ్రామంలో భూ వివాదం కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివాదంలో ఉన్న భూమిలో ఒక వర్గానికి చెందిన వారు విత్తనాలు వేస్తుండగా మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలకు చెందిన వారు గొడవపడ్డారు. గాయపడిన ముగ్గురిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామన్నారు.
ఇదీ చూడండి
విద్యార్థినిపై లైంగికదాడిలో కొత్తకోణం.. వీడియోలు సోదరుడికి పంపిన నిందితురాలు?