ETV Bharat / state

ఇళ్ల స్థలాల సేకరణ... సాగు భూములకు ఎసరు - అనంతపురంజ జిల్లా ఉప్పరలో ఇళ్ల స్థలాల సేకరన న్యూస్

దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు.. అవే జీవనాధారం. వాటినే లక్ష్యంగా చేశారు రెవెన్యూ అధికారులు. ఇళ్ల స్థలాల కోసం ముందుకు వెళ్తున్నారు. ఎముకలు అరిగిపోయేలా కొండలు, గుట్టలు చదును చేసుకొని సాగుయోగ్యంగా చేసుకున్న నిరుపేదల భూములకు అధికారులు నోటీసులు ఇస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రానికి ఏడు కిలోమీటర్ల దూరంలోని ఉప్పరపల్లె గ్రామంలో పేదల భూముల్లోని పండ్ల తోటలను నేలమట్టం చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. పోలీసు పహారాతో రైతులను అటువైపు రానీయకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఇళ్ల స్థలాల సేకరణ... సాగు భూములకు ఎసరు
ఇళ్ల స్థలాల సేకరణ... సాగు భూములకు ఎసరు
author img

By

Published : Feb 25, 2020, 9:54 PM IST

ఇళ్ల స్థలాల సేకరణ... సాగు భూములకు ఎసరు

ప్రభుత్వ ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం నిరుపేదలు సాగు చేసుకుంటోన్న భూములకు ఎసరు పెట్టేలా మారింది. ఓ వైపు ప్రభుత్వం నిరుపేదల భూములు తీసుకోవద్దని రెవెన్యూ అధికారులకు హెచ్చరికలు చేస్తుండగా, ప్రజా ప్రతినిధులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోన్న తీరు వెలుగుచూస్తోంది. ఓట్లు వేసి గెలిపించిన నాయకులే నిరుపేదల భూములను సేకరించి ఇళ్ల స్థలాలుగా మార్చాలని చెబుతున్నట్టు తెలుస్తోంది. అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధి ముందే అన్నదాతలు కన్నీరు పెట్టినా.. కనికరించని పరిస్థితి. అక్కడి రైతులు కన్నీరుమున్నీరవుతుండగానే.. రాప్తాడు నియోజకవర్గంలోని ఉప్పరపల్లెలో పచ్చటి తోటలు నేలమట్టం చేయటానికి రెవెన్యూ అధికారులు నిరుపేద రైతులకు నోటీసులు ఇచ్చారు.

నగరానికి కేవలం ఏడు కిలోమీటర్ల దూరం ఉండే ఉప్పరపల్లెలో గత ప్రభుత్వాలు ఒక చోట 1,050 ఇళ్లు, మరోచోట వెయ్యి ఇళ్ల స్థలాలు మంజారు చేశాయి. 12 ఏళ్ల క్రితం మంజూరు చేసిన స్థలాల్లో కొందరు ఇళ్లు నిర్మించుకోగా, వాటిలో నివాసం ఉండలేక లబ్ధిదారులు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ ఇళ్లన్నీ ప్రస్తుతం పాడుబడిపోయాయి. ఇదిలా ఉండగానే అదే గ్రామంలో మరో చోట తెదేపా హయాంలో వెయ్యికి పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. కేవలం ముప్పై మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఇంట్లో నివాసం లేని వారి గృహాలను స్వాధీనం చేసుకొని, వేరొకరికి పంపిణీ చేయటానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇవన్నీ చాలవన్నట్లుగా ఉప్పరపల్లెలో సర్వే నెంబర్ 51లో నిరుపేదలు సాగు చేస్తోన్న పండ్ల తోటలను నేలమట్టం చేసి, నివాస స్థలాలుగా మార్చాలని రైతులకు నోటీసులు ఇచ్చారు. తమ పొలాల వైపు కూడా రానీయకుండా, పోలీసులు బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

సీఎం జగన్‌తో ప్రపంచబ్యాంకు ప్రతినిధుల భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.