అనంతపురం జిల్లా రాప్తాడు మైనార్టీ కాలనీలో ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొన్ని రోజులుగా మృతురాలు కడపు నొప్పితో బాధ పడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. రాత్రి కడపు నొప్పి ఎక్కువ కావటంతో భరించలేక.. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుందని కన్నీరుమున్నీరవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: 'ఉపాధి పనుల కల్పనలో దేశంలోనే రెండో స్థానం'