ETV Bharat / state

ఫోన్​ తీసుకున్న భర్త.. భయపడి భార్య ఆత్మహత్య.. ఇంతలోనే మరో ట్విస్ట్..! - women suicide at thankallu

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్​లో.. మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఆమె భర్త ఫోన్ తీసుకోవడంతో.. భయపడి ప్రాణాలు తీసుకుంది. మరి, అందులో ఏముంది?

lady commit suicide at Anantapur
lady commit suicide at Anantapur
author img

By

Published : Nov 10, 2021, 12:18 PM IST

అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటిక్రాస్​లో.. శోభారాణిని అనే మహిళ బేకరీ నిర్వహస్తోంది. ఆమె భర్త నరసింహులు ఉపాధి నిమిత్తం కర్ణాటకలో ఉంటున్నారు. దీంతో.. శోభారాణి తన ఇద్దరు పిల్లలతో కలిసి కొక్కంటిక్రాస్​లో నివసిస్తోంది. అయితే.. ఆదివారం శోభారాణి భర్త నరసింహులు కర్ణాటక నుంచి వచ్చారు. బేకరీలో ఉన్న సమయంలో.. నరసింహులు తన భార్య ఫోన్ తీసుకున్నాడు.

ఇది గమనించిన శోభారాణి వెంటనే అక్కడి నుంచి హడావిడిగా ఇంటికెళ్లి.. ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దుకాణంలోనే ఉన్న నరసింహులు కొద్ది సేపటి తర్వాత ఇంటికెళ్లాడు. అప్పటికే ఉరివేసుకుని వేళాడుతున్న భార్యను చూసి నిశ్చేష్టుడైపోయాడు. పరుగున వెళ్లి, కిందకు దింపాడు. కొనఊపిరితో ఉన్న భార్యను.. చికిత్స నిమిత్తం కదిరి తరలించారు. కానీ.. ఆసుపత్రికి చేరిలోపే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.

ఏం జరిగింది?
శోభారాణి దూరపు బంధువైన తనకల్లు మండలం మరాలపల్లికి చెందిన వెంకటరమణ.. లైంగిక వాంఛ తీర్చాలని కొన్నిరోజులుగా వేధిస్తున్నాడట. దీనికి నిరాకరించిన శోభారాణి.. పలుమార్లు వెంకటరమణను హెచ్చరించింది. కానీ.. అతని వైఖరిలో మార్పురాక పోగా.. ఆమె ఫోన్ కు తరచూ సందేశాలు పంపుతూనే ఉన్నాడట. ఇప్పుడు భర్త ఫోన్ చూడడంతో.. ఏం జరుగుతుందోననే భయంతో శోభారాణి ఆత్మహత్య చేసుకుందని బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు ఆమె తండ్రి ఆదినారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు వెంకటరమణ పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన అతని కుటుంబ సభ్యులు.. చికిత్స కోసం తనకల్లు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి కదిరి వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

Maha Padayathra: అమరావతి ఆకాంక్ష.. పల్లవించె ప్రతినోటా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.