ETV Bharat / state

మద్యం దుకాణాన్ని మూసివేయాలని మహిళల ఆందోళన - అనంతపురం మద్యం షాపు వివాదం

తమ ప్రాంతంలో ఉన్న మద్యం దుకాణాన్ని మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురంలో మహిళలు ఆందోళనకు దిగారు. కరోనా ముప్పు ఉన్నా.. ఎవరూ కనీస జాగ్రత్తలు పాటించకుండా విచ్ఛలవిడిగా తిరుగుతున్నారని ఆగ్రహించారు. మందుబాబులతో నిత్యం గొడవలు జరుగుతున్నాయని ఆవేదన చెందారు.

ladies agitation against wine shop
మద్యం దుకాణాన్ని మూసివేయాలని మహిళల ఆందోళన
author img

By

Published : Jul 18, 2020, 4:01 PM IST

మద్యం దుకాణం మూసివేయాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురంలో మహిళలు ధర్నా చేపట్టారు. అనంతపురం శివారు టీవీ టవర్ సమీపంలో ఉన్న దుకాణాన్ని మూసివేయాలని మహిళలు రోడ్డుకు అడ్డంగా నిలబడి ఆందోళన చేశారు. మద్యం తాగిన వారు అక్కడే నిత్యం గొడవలు పడుతున్నారనీ.. ఫలితంగా మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడాల్సివస్తోందని చెప్పారు.

ఒక పక్క జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుంటే, మందుబాబులు ఎటువంటి మాస్కులు ధరించకుండా.. భౌతిక దూరం పాటించకుండా విచ్ఛలవిడిగా తిరుగుతున్నారని వాపోయారు. మద్యం దుకాణాన్ని తక్షణమే మూసివేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎక్సైజ్ శాఖ సీఐ.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:

గవర్నర్ ఆమోదానికి సీఆర్డీఏ, మూడు రాజధానుల బిల్లులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.