ETV Bharat / state

'క్షేత్ర సహాయకుడు పక్షపాతం చూపిస్తున్నారు'

author img

By

Published : May 28, 2020, 11:12 AM IST

‍‍జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్రసహాయకుడు అవినీతి పాల్పడుతున్నాడంటూ అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపరాల కూలీలు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు. అతడిపై చర్యలు తీసుకుని అందరికీ పనులు చూపాలని కూలీలు డిమాండ్ చేశారు.

ananthapuram district
క్షేత్రసహాయకుడు పక్షపాతం.. ఎంపీడీవోకి ఫిర్యాదు

అనంతపురం జిల్లా గాండ్లపెంట మండలం వేపరాల ప్రాంతంలో ఉపాధి హామీ కూలీలు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ‍‍జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న క్షేత్రసహాయకుడు తమకు అనుకూలమైనవారికి పనులకు రాకపోయినా మస్టర్ వేస్తున్నారని, ఆధారాలతో సహా ఏపీవో దృష్టికి తీసుకొచ్చారు. జాబ్ కార్డులు ఉన్నప్పటికీ పనులు కల్పించడంలో ఒక్కొక్కరికి ఒక్కో రీతిలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

క్షేత్రసహాయకుడిపై చర్యలు తీసుకుని అందరికీ పనులు చూపాలని కూలీలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకు భాజపా నాయకులు కేశవరెడ్డి, శ్వేతారెడ్డి అక్కడికి చేరుకుని కూలీల విషయంలోనూ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్న వారికి మాత్రమే మస్టర్ ఉండాలని, అవకతవకలకు పాల్పడితే సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. కూలీలకు అండగా భాజపా ఉంటుందని తెలిపారు.

ఇదీ చదవండి:

కుక్కర్​ మూతతో భర్తను హత్య చేసిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.