అనంతపురం జిల్లా గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ పాసు పుస్తకాల వ్యవహారంపై కర్నూలు సీఐడీ పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. గుంతకల్లు మండలంలోని నాగ సముద్రం గ్రామంలో 2014-2016 మధ్య 72 నకిలీ పాసు పుస్తకాల బాగోతంపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిమిత్తం కర్నూలు సీఐడీ సీఐ ప్రభాకర్ గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో ఇంచార్జ్ తహసీల్దార్ రామును కలిసి విచారణ చేపట్టారు.
మండల పరిధిలోని వెంకటాంపల్లి సచివాలయం వద్ద రైతులు నకిలీ పాసు పుస్తకాలు ఎలా పొందారని సీఐడీ అధికారులు విచారించారు. అప్పటి వీఆరోఓ సుధాకర్ నకిలీ పాసు పుస్తకాలను కొంత పైకానికి ఇచ్చారని రైతులు చెప్పారని తెలుస్తోంది. అయితే అప్పటి తహసీల్దార్ యల్లమ్మ పాత్ర గురించి కూడా అధికారులు ఆరా తీశారు. కేసు చివరి దశకు రావడంతో త్వరలో 72 మంది నకిలీ పాసు పుస్తకాలు ఎలా పొందారో, ఆ భూములకు బ్యాంక్ వారు లోన్లు ఎలా ఇచ్చారో త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని సీఐడీ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: జగన్ అక్రమాస్తుల కేసులో ఇక రోజువారీ విచారణ