గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జెపల్లి సమీపంలోని 63వ నెంబరు జాతీయ రహదారిపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున రాకపోకలకు అంతరాయం కలిగింది. వాహనాలు ప్రమాదానికి గురవుతున్నా... అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టడటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈనెల 1న వాగులో కారు కొట్టుకుపోగా.... 2న ఓ రైతు మరణించారని గుర్తు చేశారు.
ఇవాళ వాగులో ఓ లారీ చిక్కుకుపోయింది. ఈ కారణంగా.. గుంతకల్లు - గుత్తి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు అందించిన సమాచారంతో... పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ల సాయంతో లారీని బయటికి తీశారు. అధికారులు ముందు జాగ్రత్తగా గుత్తి - బళ్లారి మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీచదవండి: