అనంతపురం జిల్లా కల్యాణదుర్గం శివార్లలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేకెత్తించింది. బైపాస్ రోడ్డులో స్కూటీపై వెళ్తున్న ఒకరిని.... కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఆ కారు.. మారుతి స్విఫ్ట్ అని, దానికి నంబర్ ప్లేట్ లేదని పోలీసులకు వివరించారు. వారు రాయదుర్గం వైపు వెళ్లినట్టు చెబుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.... కిడ్నాప్‌నకు గురైన వ్యక్తి స్కూటీ నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
ఇవీ చూడండి: