ETV Bharat / state

'కియా' వార్తలు... ఏది నిజం..? - buggana about kia

రాష్ట్ర పారిశ్రామిక రంగానికే తలమానికంగా చెప్పుకొంటున్న అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ కియా... ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోనుందా..? రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ విధానాలతో అసంతృప్తిగా ఉన్న కియా సంస్థ ప్రతినిధులు ఇప్పటికే తమిళ తంబిలతో చర్చలు మొదలుపెట్టారా? అవునంటూ.. అంతర్జాతీయ వార్తాసంస్థ రాయిటర్స్‌ కథనం వెలువరించడం, దాన్ని పలు జాతీయ ఆంగ్ల పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో సంచలనం రేగింది.

Kia motors to move tamilnadu
'కియా' వార్తలు... ఏది నిజం..?
author img

By

Published : Feb 7, 2020, 7:49 AM IST

Updated : Feb 7, 2020, 7:54 AM IST

రాష్ట్రంలో, దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ కియా తరలింపు వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వైకాపా నేతల బెదిరింపు వల్లే ఈ దుస్థితి తలెత్తిందని, అంతర్జాతీయ సంస్థలతో వ్యవహరించే తీరు ఇదేనా అని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. పరిశ్రమలు తరలిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.

రాయిటర్స్‌ కథనం అవాస్తవమని మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, శంకరనారాయణ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌ భార్గవ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. కియా మోటార్స్‌ ఎండీతో తాను మాట్లాడానని, కంపెనీ తరలింపు అసత్యమని వైకాపా లోక్‌సభాపక్ష నేత పి.వి.మిథున్‌రెడ్డి పార్లమెంటులో వివరణ ఇచ్చారు. తమిళనాడు ప్రభుత్వం కలగజేసుకుని.. కియాతో తమవైపు నుంచి సంప్రదింపులు జరగలేదని ప్రకటించడం విశేషం.

రాయిటర్స్‌ కథనం సారాంశం ఇదీ..

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావడంతో ప్లాంటును తమిళనాడుకు తరలించాలన్న యోచనలో కియా ఉన్నట్టు రాయిటర్స్‌ తన కథనంలో పేర్కొంది. ఆ కథనం ఇలా సాగింది.. ‘కియా ఇటీవల మార్కెట్‌లోకి తీసుకొచ్చిన మొదటి మోడల్‌ సెల్టోస్‌ ఎస్‌యూవీ విజయవంతమైంది. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చెప్పడంతో నిపుణులైన సిబ్బంది దొరకడం కష్టమవుతోంది.

ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఇది కియాకి ఇబ్బందికరంగా మారినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కియా సమస్యలు ఎదుర్కొంటోందని, తమ రాష్ట్రంతో ప్రాథమిక చర్చలే జరిగాయని, వచ్చే వారం కార్యదర్శుల స్థాయి సమావేశం ఉందని, దాని తర్వాత మరింత స్పష్టత వస్తుందని తమిళనాడు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో వివిధ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయించింది. వాటిలో పీపీఏలు కూడా ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి జపాన్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు ఆసక్తి ఉన్నా.. వెనక్కి వెళ్తున్నారని 2019 ఆగస్టు 7న జపాన్‌ రాయబారి రాసిన లేఖలో ప్రస్తావించారు.’

‘తరలింపు వార్తను కియా ప్రతినిధులు ఖండించారు. తప్పుడు ప్రచారాల వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుంది. రూ.14వేల కోట్ల పెట్టుబడితో కియా ప్లాంటును ఏర్పాటుచేసింది. ప్రభుత్వ సహకారంపై కియా ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ప్లాంటుతో సమస్యలు లేకున్నా ఇలాంటి వార్త ఆశ్చర్యానికి గురిచేసినట్లు సంస్థ సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగం జాతీయ అధిపతి మనోహర్‌ భట్‌ తెలిపారు.’

-బుగ్గన

పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అనుకూలం: గౌతమ్‌రెడ్డి

‘కియా మోటార్స్‌ తరలిపోతున్నట్లు వచ్చిన వార్త నిజం కాదు. వాళ్లు తమ యూనిట్‌ను త్వరలో విస్తరించే అవకాశం ఉంది. పరిశ్రమ రాష్ట్రంలోనే ఉంటుంది. దీనిపై కియా పరిశ్రమ యాజమాన్యంతోనూ చర్చించాను. ఈ వార్తలో వాస్తవం లేదని కియా మోటార్స్‌ చెప్పింది.’

తరలింపు వార్త అవాస్తవం: రజత్‌ భార్గవ

‘కియా పరిశ్రమ తరలింపు గురించి తమిళనాడు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శితో నేను మాట్లాడాను. కియాతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని ఆయన చెప్పారు. కియా మోటార్స్‌ కూడా తరలింపుపై వచ్చిన వార్తను ఖండించింది. పరిశ్రమలను ప్రోత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కియా పరిశ్రమ రాష్ట్రంలో ఏర్పాటుచేసిన యూనిట్‌ ద్వారా ప్రస్తుతమున్న ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి రెండు లక్షల నుంచి మూడు లక్షల యూనిట్లకు పెంచాలన్న ప్రతిపాదనలో ఉంది.’

ప్రచారం వెనుక చంద్రబాబు హస్తం: శంకరనారాయణ

కియా కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన అన్ని రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. కియా పరిశ్రమ తరలిపోతోందని ప్రచారం చేయడం వెనుక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు హస్తం ఉందని ఆరోపించారు.

అనంతపురం జిల్లాలోని ‘కియా’ మోటార్స్‌ పరిశ్రమ తమిళనాడుకు వస్తోందన్న కథనాల్లో వాస్తవం లేదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి మురుగానందం తెలిపారు. కియా యాజమాన్యంతో తమ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంప్రదింపులు జరపలేదని ఆయన స్పష్టం చేశారు.

-తమిళనాడు

మా రాష్ట్రానికి రండి: పంజాబ్‌

కియా సంస్థకు పంజాబ్‌ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వాలనే పరిమితులు తమ రాష్ట్రంలో లేవని చెప్పింది. కియా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తమిళనాడుకు వెళ్లే ఆలోచనలో ఉందని రాయిటర్స్‌ కథనాన్ని ఉటంకిస్తూ లైవ్‌మింట్‌ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ ‘ఇన్వెస్ట్‌ పంజాబ్‌’ ట్విటర్‌ ఖాతా నుంచి ఈ మేరకు ట్వీట్‌ చేసింది. ప్రగతిశీల సంస్కరణల విధానాన్ని అమలుచేస్తున్న తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొంది.

Last Updated : Feb 7, 2020, 7:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.