ద్విచక్రవాహనంపై కర్ణాటకలోని బళ్ళారి నుంచి అక్రమంగా తరలిస్తున్న 24 మద్యం సీసాలను అనంతపురం జిల్లా ఉరవకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కోనాపురం వద్ద స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ శ్యాంప్రసాద్ తెలిపారు. కర్ణాటకలో మద్యానికి అధిక డిమాండ్ ఉన్నందున విక్రయిస్తున్నట్లు సిఐ శ్యాంప్రసాద్ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి :