అనంతపురం శివారు ప్రాంతంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్‌తో పాటు.. 2880 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.
శివారు ప్రాంతమైన టీవీ టవర్ సమీపంలో కుమార్, సోము అనే వ్యక్తులు పెద్ద ఎత్తున మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి రవాణా చేసి విక్రయిస్తున్నారనే సమాచారం రావడంతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: జగ్గయ్యపేటలో తెలంగాణ మద్యం పట్టివేత..