అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మెప్మా సంఘాల సభ్యులకు రూ.8.68 కోట్ల చెక్కును అందించారు. మహిళా సంక్షేమం కోసమే వైకాపా ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం అమలు చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నవారి ఉన్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కరోనా నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు