రైతుల వ్యవసాయ పొలాల్లో ఏర్పాటు చేసుకున్న మోటార్లు, బిందు సేద్య పరికరాలు చోరీ చేసిన ఇద్దరు దొంగలను అనంతపురం జిల్లా కనగానపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. లక్ష విలువైన మోటార్లు, డ్రిప్ పరికరాలను పోలీసులు రికవరీ చేశారు.
వీరు చోరీ చేసిన వాటిని అమ్మి... వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని కనగానపల్లి ఎస్సై సత్యనారాయణ తెలిపారు. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న దొంగలను... పోలీసులు పట్టుకోవడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: