ETV Bharat / state

'బీసీల విషయంలో జగన్ విఫలమయ్యారు' - kalva srinivasulu comments on bc reservations

బీసీల రిజర్వేషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతాన్ని తగ్గించడం దారుణమని పేర్కొన్నారు.

kalva srinivasulu comments on bc reservations
బీసీల రిజర్వేషన్ ప్రతులను దహనం చేస్తున్న తెదేపా నాయకులు
author img

By

Published : Mar 7, 2020, 4:41 PM IST

Updated : Mar 7, 2020, 4:56 PM IST

బీసీల రిజర్వేషన్ ప్రతులను దహనం చేస్తున్న తెదేపా నాయకులు

బీసీల గొంతు కోస్తున్న ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీమంత్రి, రాష్ట్ర తేదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బీసీ రిజర్వేషన్ జీవో ప్రతులను తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కాల్వ శ్రీనివాసులు దహనం చేశారు. బీసీలు తెదేపాకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో వారిని అణగదొక్కేందుకు జగన్​మోహన్​రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. బీసీల రిజర్వేషన్ 34 శాతం నుంచి 24 శాతాన్ని తగ్గించడం దారుణమన్నారు. సుప్రీంకోర్టులో పసలేని వాదనతోనే బీసీలు రిజర్వేషన్ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు యువత ముందుకు రావాలని పిలుపు నిచ్చారు.

ఇవీ చదవండి...రాష్ట్రంలో అమల్లోకి ఎన్నికల కోడ్

Last Updated : Mar 7, 2020, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.