ETV Bharat / state

'కాపు రామచంద్రారెడ్డి క్వారీలకు అక్రమంగా పర్మిట్లు'

కాపు రామచంద్రారెడ్డికి చెందిన కంకర క్వారీలకు ప్రభుత్వం మంజూరు చేసిన పర్మిట్​లలో అవినీతి జరిగిందని తెదేపా నేత కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ అండతో అవకతవకలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

author img

By

Published : Dec 8, 2019, 11:32 PM IST

కాల్వ శ్రీనివాసులు
కాల్వ శ్రీనివాసులు
మీడియాతో కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం నేమకల్లు వద్ద ఉన్న తెల్ల కంకర క్వారీకి... స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ప్రభుత్వం నుంచి అక్రమంగా పర్మిట్లు పొందినట్లు తెలుగుదేశం పార్టీ పొలిట్​బ్యూరో సభ్యుడు, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. రాయదుర్గంలోని తెదేపా కార్యాలయంలో కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు.

2008 సంవత్సరంలో బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామ సమీపంలో కాపు రామచంద్రారెడ్డి 20 హెక్టార్ల క్వారీని లీజుకు తీసుకున్నట్లు కాలవ తెలిపారు. ప్రభుత్వం నుంచి పొందిన పర్మిట్లతో కాపు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. క్రషర్​లోని నిల్వ కంటే ఎక్కువ పర్మిట్లు పొందారని... ఇది తీవ్రమైన నేరమని చెప్పారు. కంకర నిల్వ కంటే అధికంగా పన్ను ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి కాపు రామచంద్రారెడ్డి రూ. 1.91 కోట్లు చెల్లించాల్సి ఉండగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బకాయి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారన్నారు.

నేమకల్లు వద్ద ఉన్న కంకర క్వారీలపై గ్రీన్ ట్రిబ్యునల్​లో విచారణ జరుగుతున్నా.. అక్టోబర్ 11న బాంబులు పేల్చి పనులు చేశారన్నారు. గ్రామస్తులు అక్రమ బ్లాస్టింగ్​పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎస్సై పట్టించుకోకుండా 3 రోజుల తరువాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులు 51 మంది సంతకాలతో ఫిర్యాదు చేసినా... కేసును తప్పుదోవ పట్టించడానికి రామచంద్రారెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. కంకర క్వారీలకు ప్రభుత్వం మంజూరు చేసిన పర్మిట్​లలో అవినీతి జరిగిందని... దీనిపై న్యాయం కోసం ముందుకు వెళ్తామని కాలవ శ్రీనివాసులు చెప్పారు.

ఇదీ చదవండి

కార్యకర్తల్లో క్రమశిక్షణ ఉండుంటే...జనసేన గెలిచేది: పవన్

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.