నిరుపేదల పేరుతో వైకాపా నాయకులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు.అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బీటీపీ కాలనీని ఆయన పరిశీలించారు. స్థానికుల సమస్యలు తెలుసుకున్న కాలవ...ఇందిరమ్మ ఇళ్ల పేరుతో రూ. 4,200 కోట్ల ప్రజాధనాన్ని అప్పట్లో కాంగ్రెస్ నాయకులు స్వాహా చేశారని ఆరోపించారు. అలాంటి మరో కుంభకోణానికి ఆంధ్రరాష్ట్రం మళ్ళీ వేదికైందని విమర్శించారు.
పేదలకు ఇళ్లస్థలాల పేరుతో నిర్మానుష్యమైన ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిప్డడారు. కాంట్రాక్టర్లకు డబ్బులు దోచి పెట్టడమే వైకాపా నాయకులకు లక్ష్యంగా మారిందని దుయ్యబట్టారు. కాసుల కక్కుర్తి కోసం వైకాపా ప్రభుత్వం పేదల బతుకులతో చెలగాటమాడుతోందని ఆక్షేపించారు.
ఇదీచదవండి
ఫోన్ కాల్ ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే శ్రీదేవి.. ఏమన్నారంటే..?