అనంతపురం జిల్లా తలుపుల మండలంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో కదిరి శాసనసభ్యుడు సిద్ధారెడ్డి పాల్గొన్నారు. పులి గుండ్లపల్లి పంచాయతీ రాజనాలవారిపల్లి వెలిచలమల సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం పులిగుండ్లపల్లి చెరువు మరవ వద్ద ప్రత్యేక పూజలు చేశారు. చాలా రోజుల తరువాత నిండిన చెరువులు ఎమ్మెల్యే సిద్ధారెడ్డి వైకాపా నాయకులు స్థానికులతో కలిసి జల హారతి ఇచ్చారు. వీటితో పాటు వివిధ పథకాల కింద చేపడుతున్న రహదారుల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: