ETV Bharat / state

జల్సాల జూనియర్ అసిస్టెంట్... రూ.50 లక్షలు సొంత ఖాతాకు బదిలీ

హెచ్చెల్సీ కాలవ లోకలైజేషన్​లో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేసే ప్రవేశ్​కుమార్.. అక్రమాల వ్యవహారం బయటపడింది. 47 బిల్లులకు సంబంధించి దాదాపు 50 లక్షల రూపాయల సొమ్మును సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని రిమాండ్​కు పంపారు. ఈఈ సురేష్ బాబును రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేశారు.

జల్సాల జూనియర్ అసిస్టెంట్... రూ.50 లక్షలు స్వాహా..!

author img

By

Published : Mar 25, 2021, 6:58 PM IST

అధికారుల వివరణ

పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సొమ్ముతో పాటు, కార్యాలయం డబ్బు కాజేసిన జలవనరుల శాఖ జూనియర్ క్లర్క్​ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు. అనంతపురం జిల్లా హెచ్చెల్సీ కాలవ లోకలైజేషన్​లో జూనియర్ అసిస్టెంట్​గా పనిచేసే ప్రవేశ్​కుమార్... 47 బిల్లులకు సంబంధించి దాదాపు 50 లక్షల రూపాయల సొమ్మును సొంత ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి.. తన పీఎఫ్ సొమ్ము 18 లక్షల రూపాయలు వేరొకరి బ్యాంకు ఖాతాకు జమచేసి కాజేసినట్లు బాధితుడు అధికారులకు ఫిర్యాదు చేయగా.. ఈ అక్రమాలు వెలుగుచూశాయి.

కార్యాలయంలో మంజూరు చేసిన బిల్లుల మొత్తాన్ని పంపిణీ చేయకుండా... వేర్వేరు చోట్ల బినామీ ఖాతాలకు బదిలీచేసి కాజేసినట్లు జలవనరులశాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ అక్రమాలపై శాఖాపరమైన విచారణ కోసం లోకలైజేషన్ ఈఈ సురేష్ బాబును వివరణ కోరినప్పటికీ సమాధానం రాని కారణంగా... ఆయనపైనా వేటు వేసి... రాష్ట్ర కార్యాలయానికి సరెండర్ చేశారు. అక్రమాలపై హెచ్చెల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఫిర్యాదుతో జూనియర్ అసిస్టెంట్ ప్రవేశ్​కుమార్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టు ముందుంచారు. కోర్టు ఆదేశాలతో నిందితుడిని రిమాండ్​కు పంపారు. ఈఈ సురేష్​బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులకు లేఖ పంపారు. అక్రమాలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.