ఎమ్మెల్యే పాత్రికేయ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా... ఓ కానిస్టేబుల్ తమపై అమానుషంగా ప్రవర్తించాడని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఇద్దరు జర్నలిస్టులపై ఒక కానిస్టేబుల్ దుర్భాషలాడి చేసుకున్నాడని ఆగ్రహించిన జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించకూడదని పదేపదే ప్రకటనలు చేస్తున్నా పోలీసులు ఇలా ప్రవర్తించడం తగదన్నారు.
పోలీసులు దాడి చేశారంటూ జర్నలిస్టులు ధర్నా - journalist protest in kalyanadurgam
జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా పోలీసులు తమపై అమానుషంగా ప్రవర్తిస్తున్నారని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని జర్నలిస్టులు అంటున్నారు. ఓ ప్రజా ప్రతినిధి పాత్రికేయ సమావేశానికి వెళ్లి వస్తుండగా పోలీసులు తమపై దాడి చేశారంటూ ధర్నా నిర్వహించారు.
ఎమ్మెల్యే పాత్రికేయ సమావేశానికి వెళ్లి తిరిగి వస్తుండగా... ఓ కానిస్టేబుల్ తమపై అమానుషంగా ప్రవర్తించాడని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఇద్దరు జర్నలిస్టులపై ఒక కానిస్టేబుల్ దుర్భాషలాడి చేసుకున్నాడని ఆగ్రహించిన జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల విధులకు ఆటంకం కలిగించకూడదని పదేపదే ప్రకటనలు చేస్తున్నా పోలీసులు ఇలా ప్రవర్తించడం తగదన్నారు.
ఇవీ చూడండి-పిల్లలూ.. బొమ్మలు ఇలా వేసేయండి..!