ఆరోగ్యశ్రీ అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అనంతపురం సంయుక్త పాలనాధికారి సిరి హెచ్చరించారు. జిల్లాలోని దివ్యశ్రీ, అమరావతి ఆసుపత్రులను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఆరోగ్యశ్రీ దరఖాస్తు చేసుకున్న వారి నుంచి డబ్బులు వసూలు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుపైన అన్నిరకాల వైద్య చికిత్సలు, టెస్టులు ఉచితంగా చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన పెంచుకోవాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చదవండి: