అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గన్నివారిపల్లిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పర్యటించారు. గన్నివారిపల్లి పంచాయతీ మాజీ సర్పంచి ఓ ఘర్షణ కేసులో అరెస్టై 60 రోజుల తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. వెంకటరమణను జేసీ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సీఎం జగన్ తీసుకొచ్చిన జీవో ద్వారా తెదేపా నాయకులెవ్వరు సర్పంచి, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో పాల్గొనటం లేదన్నారు. తమపార్టీ నాయకులు స్వచ్ఛందంగా గెలిచిన అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని దుయ్యబట్టారు. పోటీ లేకుండా వైకాపా గెలివాలనే ఉద్దేశ్యంతోనే జీవోలు తీసుకొచ్చారని విమర్శించారు. జీవోల కారణంగా తెదేపా సర్పంచులకు లక్షల్లో నగదు మిగిలిందని వ్యాఖ్యానించారు. విశాఖలో తమ అధినాయకుడుని పోలీసులు అడ్డుకున్న సమయంలో సురక్షితంగా బయట పడినందుకు తాము ఎంతో సంతోషిస్తున్నామన్నారు.
ఇవీ చదవండి