ETV Bharat / state

సజ్జల డైరెక్షన్​లో.. "అనంత" పోలీసులు పనిచేస్తున్నారు: జేసీ - సజ్జలపై జేసీ కామెంట్స్

జిల్లా పోలీసులు ఆత్మసాక్షిగా పనిచేయాల్సిందిపోయి.. ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సజ్జల డైరెక్షన్​లో పనిచేస్తూ.. 2018 నాటి ప్రభోదానంద కేసులో అమాయకులను ఇరికిస్తున్నారన్నారు.

సజ్జల డైరెక్షన్​లో అనంత పోలీసులు పనిచేస్తున్నారు

author img

By

Published : May 2, 2022, 3:37 PM IST

Updated : May 2, 2022, 5:15 PM IST

సజ్జల డైరెక్షన్​లో.. "అనంత" పోలీసులు పనిచేస్తున్నారు: జేసీ

అనంతపురం జిల్లా పోలీసులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్​లో పనిచేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 2018 నాటి ప్రభోదానంద కేసులో ఇప్పటికీ అమాయకులను ఇరికిస్తున్నారన్నారు. తెదేపా కార్యకర్తలను ప్రభోదానంద కేసులో ఇరికిస్తానంటూ.. పెద్దవడుగూరు ఎస్సై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఆత్మసాక్షిగా పనిచేయాల్సిందిపోయి.. సజ్జల చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్నారు.

కేటీఆర్ వాస్తవాలే చెప్పారు: ఏపీలో సమస్యలపై చక్కగా చెప్పిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆ వెంటనే మాటను ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం కావట్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అక్షరాల కేటీఆర్ చెప్పినట్లుగా పరిస్థితులు ఉన్నాయన్నారు. మాట జారానని కేటీఆర్ చెబుతున్నా.. వాస్తవాలే మాట్లాడరని అన్నారు. ఏపీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫోటోలు తీసి పంపటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. కేటీఆర్ మాత్రం తన మాటను వెనక్కి తీసుకోవద్దని కోరారు.

ఇదీ చదవండి: CBN LETTER: జంగిల్​ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరవైంది.. డీజీపీకీ చంద్రబాబు లేఖ

Last Updated : May 2, 2022, 5:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.