అనంతపురం జిల్లా తాడిపత్రిలో కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను.. వైకాపా నాయకులు కాజేస్తున్నారని.. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. కలెక్టరేట్ లోని స్పందన కార్యక్రమంలో.. ఆయన జిల్లా పాలనాధికారి నాగలక్ష్మిని కలిసి భూ కబ్జాలపై ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ భూములను కాపాడాలని.. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తాడిపత్రిలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకుంటూ.. దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ. 220 కోట్ల భూమి కబ్జా
రూ. 220 కోట్ల విలువ చేసే మున్సిపల్ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. స్వయానా ఎమ్మెల్యే బంధువు పేరుపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అన్నారు. తాడిపత్రిలో రిజిస్ట్రేషన్లు చేయకపోతే.. అనంతపురం రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు.
రెవెన్యూ అధికారులు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. చర్యలు తీసుకోకపోతే తాము రంగంలోకి దిగి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
ATCHENNAIDU: 'సీఎం తండ్రి విగ్రహాలే ఉండాలా.. మరే మహానుభావులవి ఉండొద్దా'