ఇవీ చదవండి.
'ఆదరణ చూడలేకే కక్ష సాధింపు చర్యలు' - ఎన్నికల
ఎన్నికల నిబంధనల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన, సీపీఐ అభ్యర్థులు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. తమ ప్రచారాలకు అవకాశం లేకుండా కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
'ఆదరణ చూడలేకే కక్ష సాధింపు చర్యలు'
ఎన్నికల నిబంధనల పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అనంతపురం జిల్లా గుంతకల్లులో జనసేన, సీపీఐ అభ్యర్థులు ఎన్నికల అధికారిపై మండిపడ్డారు. గుంతకల్లు జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా తదితరులు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి గతంలో కుట్టు యంత్రాలు తమ నివాసంలో ఉంచామనీ... అవి ఎన్నికల ప్రచారంలో పంపిణీ చేస్తారని వచ్చిన వార్తలతో.. రిటర్నింగ్ అధికారి, పోలీసులు తమ ఇంటిపై సోదాలు జరపడం అమానుషమని అన్నారు. తమ ప్రచారాలకు అవకాశం లేకుండా కావాలనే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. నియోజకవర్గంలో జనసేనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇతర పార్టీలు తమపై కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నాయని అనంతపురం పార్లమెంట్ సీపీఐ అభ్యర్థి జగదీష్ దుయ్యబట్టారు.
ఇవీ చదవండి.
Contributor : R.SampathKumar Centre : Guntakal, Anantapur Dist Date:30-03-2019
Slug:AP_Atp_24_30_police_search_janasena_guptha_hse_gty_Avb_C15
anchor:-
అనంతపురం జిల్లా,గుత్తి పట్టణంలోని జనసేన అభ్యర్థి కె.మధుసూదన్ గుప్తా నివాసంలో పోలీసులు,పురపాలక అధికారులు కలిసి సోదాలు నిర్వహించారు. గుప్తా ఓటర్లకు కుట్టు యంత్రాలను ఎరగా చూపి పంచడానికి సిద్ధం గా ఉంచారన్న సమాచారంతో సిఐ ప్రభాకర్ ,రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు గుప్తా నివాసం పై తనికీలు చేశారు.తనీకీ లో భాగం గా 9లక్షలు విలువ చేసే 39 కుట్టు మెషీన్ లను అధికారులు,స్వాధీన పరుచుకొని సీజ్ చేశారు.అనంతరం వీటిపై లోతుగా దర్యప్తు జరిపి వివరాలు మీడియా కు తెలియజేస్తామని తెలిపారు.గుప్తా సోదరుడు ఇవి ఓటర్లను ప్రభావితం చేయడానికి కాదని,పేదలకు ఉచితంగా ఇవ్వడానికి అప్పట్లోనే కొన్నామని అన్నారు.గుత్తి లోని పేద కార్మికులకు జీవనోపాధి కల్పించడానికీ తమ సోదరుడు నిల్వ ఉంచారని అన్నారు.అన్ని రసీదులు తమ దగ్గర ఉన్నాయని చట్టబద్ధంగా తమ వస్తువులు తిరిగి స్వాధీన పరుచుకుంటామని తెలిపారు.
బైట్1:- ప్రభాకర్ సి.ఐ గుత్తి