అనంతపురం జిల్లా వ్యాప్తంగా 95 లక్షల మెుక్కలు నాటుతున్నట్లు డీఎఫ్ఓ జగన్నాథ్సింగ్ వెల్లడించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా అటవీ, ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేదల గృహ నిర్మాణ పథకం లబ్ధిదారుల సహకారంతో ఆయా సముదాయాల వద్ద పెద్ద ఎత్తున మెుక్కలు నాటే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వివరించారు. ఇప్పటికే 12 లక్షల మెుక్కలు పంపిణీ చేశామనీ, మరో వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు మెుక్కలను తరలిస్తామని జగన్నాథ్సింగ్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో మెుక్కలు నాటిస్తున్నట్లు తెలిపారు. మెుక్కల కోసం రెండు కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: నేటి నుంచి.. అందుబాటులోకి రవాణా ఆన్లైన్ సేవలు