ETV Bharat / state

Jail theme restaurant: అదిరే ఫుడ్​ కావాలంటే.. ఆ 'జైలు'కు వెళ్లాల్సిందే

Jail theme restaurant: వీకెండ్స్‌లో రెస్టారెంట్లకు వెళ్లడం అలవాటైపోయింది. ఇది వరకు ఏ రెస్టారెంట్‌లో రుచికరమైన వంటకాలు దొరుకుతాయా..? అని జనం ఆరా తీసేవాళ్లు. ఇప్పుడు.. ఎక్కడికి వెళ్తే సరికొత్త అనుభూతి కలుగుతుందా? అని వెతుకుతున్నారు. ఎటుచూసినా రొటీన్ ఫుడ్డే! కనీసం.. రొటీన్ ప్లేస్ దొరికినా బాగుంటుంది కదా? అని ఫీలవుతున్నారు. అలాంటి వారికి "జైలు ఫుడ్​ తినిపిస్తాం" అంటూ పిలుస్తోంది ఒక రెస్టారెంట్. అనంతపురంలో ఉన్న ఈ రెస్టారెంట్ సంగతేంటో మీరూ చూసేయండి

jail theme restaurant in ananthapur district
అనంతపురంలో జైలు థీమ్ రెస్టారెంట్​
author img

By

Published : Jan 7, 2022, 6:24 PM IST

Updated : Jan 7, 2022, 10:42 PM IST

అనంతపురంలో జైలు థీమ్ రెస్టారెంట్​

Jail theme restaurant: అనంతపురం నగరంలోని రుద్రంపేట బైపాస్ పక్కానే ఉంది.. ఈ ప్రిజన్‌ హోటల్‌. ఇందులోకి అడుగుపెట్టగానే జైలుకు వచ్చామనే భావన కలుగుతుంది. వెళ్లగానే ఎదురుగా జైలుకు కాపలాగా ఉండే సెంట్రీ, ఎక్కడ చూసినా తుపాకులు, కారాగారంలో ఉంచే కత్తులు కనిపిస్తాయి. అక్కడికి వెళ్లగానే ఖైదీ దుస్తుల్లో ఉన్న సర్వర్లు దగ్గరికి వచ్చి జైలు ఊచల తలుపు తెరిచి కటకటాల్లోకి పంపి తాళం వేస్తారు. ఇది రెస్టారెంట్‌ కాదు.. జైలే అన్న అనుభూతి కలుగుతుంది.

రెస్టారెంట్ వాతావరణం గుర్తుండిపోయేలా..
అనూష, మనోజ్, రఘువంశీలు కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తుండేవారు. కరోనా కారణంగా వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. దీంతో.. దొరికిన ఖాళీ సమయం వ్యాపారానికి కేటాయించాలి అనుకున్నారు. రెస్టారెంట్‌ ఏర్పాటు చేయాలనుకున్నారు. అందుకోసం.. వివిధ రెస్టారెంట్లు పరిశీలించగా.. ఆయా హోటళ్లు ఆహారం అందిస్తున్నాయే తప్ప వినియోగదారులకు సరికొత్త అనుభూతి ఇవ్వట్లేదని గుర్తించారు. రెస్టారెంట్‌కు వచ్చిన వారికి రుచితో పాటు.. అక్కడి వాతావరణం గుర్తుండిపోయేలా ఉండాలనుకున్నారు. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే.. ది ప్రిజన్.

ధరలు కూడా తక్కువే..
ఇక్కడ రెగ్యూలర్‌గా అనంతపురంలో దొరికే టిఫిన్లు వంటివి లభిస్తాయి. థీమ్‌ రెస్టారెంట్ కదా..! అని ధరలు ఎక్కువగా ఉంటాయని అనుకోకండి. తక్కువ ధరల్లోనే నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ తరహా థీమ్‌ రెస్టారెంట్‌ అందుబాటులోకి రావడంపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ట్రెండ్​కు తగ్గట్లు ఆలోచన..
ఒకప్పుడు వ్యాపారం చేసేవారు తక్కువ. దీంతో ఎలా ముందుకు సాగినా లాభాలు వచ్చేవి. ఇప్పుడు ట్రెండ్‌ మారింది. మార్కెట్‌లో పోటీ తట్టుకుని నిలబడాలంటే.. వినూత్నంగా ఆలోచించాలి. అలా అయితేనే విజయం సాధించగలమంటున్నారు.. ఈ యువ వ్యాపారులు.

ఇదీ చదవండి:

Kashmiri Apple Ber Farming: వినూత్న​ రీతిలో యాపిల్​ బేర్ సాగు.. లాభాలు బాగు

Last Updated : Jan 7, 2022, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.