ETV Bharat / state

కొలత బూటుకం.. కుట్టుకూలి నాటకం! - విద్యా కానుక బూట్లు సమస్యలు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం విద్యాకానుక అందిస్తోంది.. పుస్తకాలు, ఏకరూప దుస్తులతోపాటు బూట్లు తదితరాలను పంపిణీ చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పలు సమస్యలు వెంటాడుతున్నాయి. చాలామంది విద్యార్థులకు సరిపడా సైజుల్లో బూట్లు రాకపోవడంతో తొడుక్కోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఏకరూప దుస్తుల కుట్టు గురించి స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు. మూడు జతలకు సంబంధించి వస్త్రం ఇస్తున్నారు. వాటిని కుట్టించుకోవడం పేదలకు భారంగా మారింది.

కొలత బూటుకం.. కుట్టుకూలి నాటకం!
కొలత బూటుకం.. కుట్టుకూలి నాటకం!
author img

By

Published : Oct 16, 2020, 9:44 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యాకానుక పేరిట పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బూట్లు పంపిణీ చేస్తున్నారు. కానీ వీటి పంపిణీలో సమస్యలు తలెత్తున్నాయి. విద్యార్థులకు సరిపడా సైజుల్లోి బూట్లు రాకపోవడం, ఏకరూప దుస్తులు కుట్టుడంపై స్పష్టమైన ఉత్తర్వుల లేకపోవడంపై సందిగ్ధత నెలకొంది. మూడు రోజుల్లోనే అందరికీ కిట్లు ఇవ్వాలని ఆదేశించినా.. బయోమెట్రిక్‌ సమస్యతో 8 రోజులైనా సరఫరా చేస్తూనే ఉన్నారు.

బూట్లు చూపుతున్న విద్యార్థి
బూట్లు చూపుతున్న విద్యార్థి

బూట్లు తొడుక్కోవడానికి ఇబ్బంది పడుతున్న ఈ విద్యార్థి ఇమ్రాన్‌. అనంతపురం పాతూరు ప్రభుత్వ నంబరు-2 పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థికి 8వ నంబరు సైజు అవసరం. ఈ పాఠశాలకు 4, 5, 6, 7 నంబర్ల సైజు బూట్లు మాత్రమే వచ్చాయి. 8, 9, 10 నంబరు బూట్లు అవసరం ఉన్న విద్యార్థులు వంద మంది దాకా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి జిల్లాలోని చాలా పాఠశాలల్లో నెలకొంది. తక్కువ సైజు ఉన్న వాటినే ఇచ్చేస్తున్నారు.

దుస్తులు చూపుతున్న విద్యార్థి
దుస్తులు చూపుతున్న విద్యార్థి

ఇక్కడ సమరూప దుస్తులు చూపుతున్న విద్యార్థి చరణ్‌. 7వ తరగతి చదువుతున్నాడు. అమ్మ రమణమ్మ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తోంది. బుక్కరాయసముద్రం మండలంలోని కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆసుపత్రిలో నెలకు వచ్చే రూ.5 వేలతోనే కుటుంబాన్ని పోషించాలి. విద్యార్థికి సమరూప దుస్తుల కుట్టు కూలి జతకు రూ.400 అడిగారు. మూడు జతలకు రూ.1200 అవుతుంది. మాలాంటి పేదలకు భారంగా మారిందని ఆమె పేర్కొంది.

కొలతలు తప్పాయ్‌..

విద్యార్థుల పాదాల కొలతలు ఇప్పటికే రెండుసార్లు తీసుకున్నారు. అయినా కొందరికి సరిపోయే సైజులు రాలేదు. పాదాలు పెద్దగా ఉన్న విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. సైజులు సరిపోకున్నా ఇంటికి తీసుకెళ్లాలని, పాఠశాలలు ప్రారంభించిన తర్వాత మార్పు చేసి ఇస్తామని చెబుతున్నారు. ఎక్కువ పాఠశాలల్లో బూట్లు ఇవ్వకుండా కిట్‌ ఇచ్చేసినట్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేశారు. బ్యాగు కుట్లు ఊడుతున్నాయి.. జిప్పులు సక్రమంగా పడటం లేదు.

అదనపు భారం

అసలే కరోనాతో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మూడు జతలు యూనిఫాం కుట్టించడం కష్టమే. ఒక్కో జతకు రూ.40 ఇస్తామని, ఆ సొమ్ము తల్లుల ఖాతాలకు జమ చేస్తామని చెబుతున్నా అధికారికంగా ఉత్తర్వులు రాలేదు. ఒక్కో జతకు కుట్టు కూలి రూ.400 నుంచి రూ.500 వరకు ఉంది. మూడు జతలకు రూ.1200 చెల్లించాల్సిందే. ఈ లెక్క జిల్లాలో రూ.43.56 కోట్లు విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతుంది. గతంలో విద్యార్థులకు ఏకరూప దుస్తులను కుట్టించి ఇచ్చేవారు.

వెనక్కి ఇవ్వొచ్చు

బూట్ల కొలతలు తక్కువగా ఉంటే వెనక్కి ఇచ్చి తెచ్చుకోవాలి. కిట్టులో ఉన్న వస్తువులన్నీ ఇచ్చినట్లు ఇప్పటికే 90 శాతానికి పైగా ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. దుస్తులకు కుట్టు కూలి ఇస్తారు. ఎంత ఇస్తారో స్పష్టమైన ఉత్తర్వులు రాలేదు.

- గురుప్రసాద్‌, సీఎంఓ

ఇదీ చదవండి : నిండుకుండల్లా జలాశయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.