అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్వచ్ఛంద సంస్థ ఐకాస ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేశారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలి వద్ద ఈ కార్యక్రమం చేపట్టారు. ఐకాస నేతలు మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి తన పాదయాత్రలో గుంతకల్లులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా బ్లడ్ బ్యాంక్ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు.
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు గుంతకల్లులో ప్రభుత్వ బ్లడ్ బాంక్ ఏర్పాటు చేస్తామన్న మాటలు ప్రతిపాదనలకే పరిమితం అవుతున్నాయన్నారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క చాలా మంది మరణిస్తున్నారని.. తాము రక్తం కోసం పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని బళ్లారి, ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.
ఇవీ చదవండి..
'ఎస్సీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.. డీజీపీ గారూ సమీక్షించండి'