అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటనే రక్త నిధి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో స్వచ్ఛంద సంస్థలు జేఏసీ తలపెట్టిన అమరణ నిరాహార దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చారని ఇంతవరకు ఎటువంటి పనులు చేయలేదని జేఏసీ నేతలు వాపోయారు. గత నెల రోజులనుంచి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేశామని...ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం లేక ప్రజల ప్రాణాలు పోతున్నాయని...సీఎం స్పందించాలని నాయకులు కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు ఈ దీక్ష అపబోమని జేఏసీ ఉద్యమ నాయకుడు మంజుల వెంకటేష్ హెచ్చరించారు.
ఇదీ చూడండి. స్వనిధి... వ్యాపారానికి పెన్నిధి