అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో.. మొహర్రం వేడుకల్లో అపశృతి దొర్లింది. 2 ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. ఉరవకొండ మండలం ఆమిద్యాలలో ఓ కానిస్టేబుల్ తీరుపై.. స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్లను ఎత్తినవారిని కర్రతో చితకబాదాడంటూ.. కానిస్టేబుల్‌పై గ్రామస్థులు తిరగబడ్డారు. ఆందోళనకు దిగారు. ఎస్సై ధరణి బాబు అక్కడికి చేరుకుని ఆ కానిస్టేబుల్‌తో క్షమాపణలు చెప్పించిన తర్వాత గ్రామస్థులు శాంతించారు.
మరో చోట..
బెలుగుప్ప మండలం శ్రీరంగాపురం గ్రామంలో మొహర్రం ఊరేగింపును ఫోన్లో చిత్రీకరిస్తున్నారనే ఉద్దేశంతో ఓ యువకుడిపై కొందరు దాడి చేశారు. అది కాస్తా.. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఆదివారం పీర్ల పండగ సందర్భంగా గ్రామానికి చెందిన కొందరు యువకులు తప్పెట కొడుతుండగా, కణేకల్ మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయంలో వారి మధ్య వివాదం జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన ఆరుగురు గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు మోహరించారు.
నమోదు కాని కేసులు
అమిద్యాలతో పాటు.. శ్రీరంగాపురం గ్రామాల్లో జరిగిన ఘటనలపై.. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఈ కారణంగా.. కేసులు నమోదు కాలేదు.
ఇదీ చూడండి: