అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నాహోబిలంలో వెలసిన.. శ్రీ ఉద్భవ లక్ష్మీ అమ్మవారి నూతన ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవ ఆహ్వాన పత్రికలను ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు విడుదల చేశారు. శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి ఉపాలయంలో.. ఈ నెల 15 నుంచి 17 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఈవో సాకే రమేష్ బాబు వెల్లడించారు.
డిసెంబర్ 15వ తేదీ సాయంత్రం ఆచార్య ఋత్వి ఘగ్వర్ణం, విశ్వక్ సేనారాదన, పుణ్య హవచనం, అజస్ర దీపారాధన, మేధిని పూజ, అంకురార్పణ, యాగశాల ప్రవేశం తదితర ప్రత్యేక పూజలు జరుతాయని ఈవో తెలిపారు. 16న ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రత్యేక పూజలు, సాయంత్రం ఐదు నుంచి 8గంటల వరకు ధ్వజస్తంభ మహా శాంతితో పాటు వివిధ హోమాలు నిర్వహిస్తామన్నారు. 17న ఉదయం 8:00-8:36 నిమిషాల మధ్య ధనుర్ లగ్నమందు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజస్తంభానికి కుంభవాహనం, మహా మంగళ హారతి, ఆచార్య బహుమానం, తీర్థ ప్రసాద వినియోగం, మహదాశీర్వచనం కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బాలాజీ స్వామి, ద్వారాకానాథ్ స్వామితో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: