ETV Bharat / state

International Craft Award: నిమ్మలకుంట కళాకారుడికి.. ప్రతిష్ఠాత్మక అవార్డు

International Craft Award: అనంతపురం జిల్లాకు చెందిన తోలుబొమ్మల కళాకారుడిని.. ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ అవార్డ్‌ - 2021 వరించింది. దళవాయి కుళ్లాయప్ప తయారుచేసిన హనుమాన్‌ కళాఖండానికిగానూ ఈ అవార్డు దక్కింది.

International Craft Award
International Craft Award
author img

By

Published : Jan 9, 2022, 4:45 PM IST

International Craft Award: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందిన తోలుబొమ్మల కళాకారుడు దళవాయి కుళ్లాయప్పను.. ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ అవార్డ్‌- 2021 వరించింది. కుళ్లాయప్ప తయారుచేసిన హనుమాన్‌ కళాఖండానికి ఈ అవార్డు దక్కింది. క్రాఫ్ట్‌ విలేజ్‌ హ్యాండ్‌క్రాఫ్ట్‌ సంస్థ సహకారంతో.. ఈ హనుమాన్‌ కళాఖండాన్ని ఆయన నామినేషన్‌ పంపారు.

గతంలో తోలుబొమ్మల తయారీలో యువ కళాకారుడిగా పలు అవార్డులు పొందిన కుళ్లాయప్పకు.. ఇప్చుడు ఏకంగా అంతర్జాతీయ అవార్డు రావడంపై గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో దిల్లీలో నిర్వహించే ఇండియా క్రాఫ్ట్‌ వీక్‌ కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ క్రాఫ్ట్‌ సంస్థ నుంచి ఈ అవార్డును కుళ్లాయప్ప అందుకోనున్నారు.

ఇదీ చదవండి: Sankranti Sambaralu: అక్కడ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు... ఎందుకో తెలుసా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.