రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి మృతి - ఉరవకొండలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వజ్రకరూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి వేణు బైక్పై వెళ్తూ ముందున్న లారీని ఓవర్ టేక్ చేయబోయాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి లారీ వెనుక చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇంటర్ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతి