ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల గుర్తింపునకు కసరత్తు - ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దు తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక సరిహద్దుల గుర్తింపునకు యంత్రాంగం కదిలింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో నేటి నుంచి సర్వేఆఫ్ ఇండియా నిపుణులు, అధికారుల బృందం వివాదాస్పద సరిహద్దు ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ కార్యాలయం నుంచి 13 మంది అధికారులు ఈ సర్వే కోసం వచ్చారు. శుక్రవారం కర్ణాటకలోని తోర్నగల్ జిందాల్ పరిశ్రమ సమావేశ మందిరంలో సర్వేఆఫ్ ఇండియా అధికారులు ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇరు రాష్ట్రాల అధికారులతో కలిసి సర్వేఆఫ్ ఇండియా నిపుణులు అనంతపురం జిల్లా డి.హీరేహాల్ మండలంలో అంతర్రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలను పరిశీలించారు.

inter state
inter state
author img

By

Published : Oct 16, 2020, 10:17 PM IST

దశాబ్దంన్నర కాలంగా ఆంధ్రప్రదేశ్- కర్ణాటక రాష్ట్రల మధ్య నలుగుతున్న సరిహద్దు వివాదం మరో రెండు నెలల్లో సమసిపోనుంది. మైనింగ్ కంపెనీలు అక్రమంగా చొరబడి.. అంతర్రాష్ట్ర సరిహద్దులను చెరిపేసిన విషయం తెలిసిందే. ఈ సరిహద్దులు పునరుద్దరించటంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. భూ భాగం తమదంటే.. తమదనే దోరణిలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు పట్టుబట్టి, సుప్రీం కోర్టుకు వెళ్లాయి.

దీంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు గతంలో 8 సార్లు నిర్వహించిన సర్వేల ఆధారంగా గుర్తించిన హద్దులను.. మరోసారి పరిశీలించి రెండు రాష్ట్రాల భూ భాగాన్ని విభజించి పిల్లర్లు వేయనున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన రేఖను సూచించే భూభాగం 17 కిలోమీటర్లు ఉందని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్దరించారు. శుక్రవారం అధికారుల బృందం డి.హీరేహాల్ మండలంలోని సిద్ధాపురం, ఓబులాపురం, మలపనగుడి గ్రామాల్లో పర్యటించి ముందస్తు పరిశీలన చేశారు.

అక్రమ మైనింగ్​తో చొరబడిన ప్రాంతంలో ఇరు రాష్ట్రాల హద్దుల రాళ్లు తొలగించగా.. అక్కడక్కడా పూర్వం హద్దు రాళ్లు గుర్తించారు. ఈ హద్దుల నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 17 కిలోమీటర్ల పొడవునా సరిహద్దులు పక్కాగా చేయనున్నారు. గతంలో అధికారులు వేసిన ప్రాథమిక అంచనా ప్రకారం 110 హద్దు రాళ్లు వేయాలని నిర్ణయించగా.. క్షేత్రస్థాయి తాజా పర్యటనతో 130 వరకు పిల్లర్లు నిర్మించాలని తేల్చారు. ఈ సంఖ్య అవసరాన్నిబట్టి పెంచాల్సి రావచ్చని ఇరు రాష్ట్రాల జిల్లా అధికారులకు సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు చెప్పారు.

హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ డిఎస్ మెహరా పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ సర్వేలో రెండు రాష్ట్రాల నుంచి రెవెన్యూ, అటవీ, గనులు, సర్వేశాఖల నుంచి అధికారులు పాల్గొంటున్నారు. అనంతపురం జిల్లా జేసీ నిశాంత్ కుమార్​ను రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేకు నోడల్ అధికారిగా నియమించింది. ఆయన ఆదేశాల మేరకు సర్వే ఆఫ్ ఇండియా అధికారులకు సహకరించటంతో పాటు.. అవసరమైన సాంకేతిక సౌకర్యాలను సమకూర్చారు. అటవీశాఖ సిబ్బందిని సహాయకులుగా నియమించారు. రెవెన్యూ, మైనింగ్ శాఖలు సాంకేతిక సహాయం అందించనున్నాయి.

గుర్తించిన సరిహద్దు మార్కింగ్​లో పిల్లర్లు ఏర్పాటు చేసే బాధ్యతను అనంతపురం జిల్లా రోడ్లు, భవనాలశాఖకు అప్పగించారు. ఈ సర్వే, పిల్లర్ల నిర్మాణానికి రెండు నెలలు పడుతుందని సర్వే ఆఫ్ ఇండియా అధికారులు జిల్లా యంత్రాంగానికి చెప్పారు. రెండు రాష్ట్రాల్లోని 8 సరిహద్దు గ్రామాల్లో సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు నాలుగు రోజుల పాటు పర్యటించి చెరిపేసిన హద్దులను పరిశీలించనున్నారు. అనంతరం సాంకేతిక పరికరాలను క్షేత్రస్థాయికి తరలించి పని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: భారత్​లో కనిష్ఠానికి కరోనా మరణాల రేటు​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.