ETV Bharat / state

LAND RESURVEY: తుదిదశకు.. సమగ్ర భూ సర్వే పైలెట్ ప్రాజెక్ట్ - ఆనంతపురం జిల్లా తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో... సమగ్ర భూ సర్వే పైలెట్ ప్రాజెక్టు తుది దశకు చేరింది. డిసెంబర్‌లో ఐదు గ్రామాల్లో సర్వే పనులు మొదలుపెట్టగా నాలుగు ఊళ్లలో పూర్తైంది. మరో గ్రామంలో డ్రోన్ చిత్రాలు క్రోడీకరిస్తున్నారు. గ్రానైట్ పరిశ్రమల్లోని వృథా రాళ్లతో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయనున్నారు.

తుదిదశకు చేరిన సమగ్ర భూ సర్వే పైలెట్ ప్రాజెక్ట్

author img

By

Published : Jul 20, 2021, 6:07 AM IST

తుదిదశకు చేరిన సమగ్ర భూ సర్వే పైలెట్ ప్రాజెక్ట్

రాష్ట్రంలో శాఖలవారీగా మొదలైన సమగ్ర భూ సర్వే పనులు అనంతపురం జిల్లాలో తుదిదశకు చేరుకున్నాయి. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున ఐదింటిని ఎంపిక చేసిన రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు.. ఆర్నెళ్ల క్రితం సర్వే మొదలుపెట్టారు. నాలుగు గ్రామాల నివేదికలు సిద్ధమవగా కల్యాణదుర్గం పరిధిలోని ఓ గ్రామంలో డ్రోన్ తీసిన చిత్రాలు ఇంకా రావాల్సి ఉంది. అది వచ్చాక ఆ నివేదికా సిద్ధమవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా నివేదికలు అందుకోనున్న సర్వే ఆఫ్ ఇండియాపరిశీలించి గ్రామ భూ పటం, సర్వే నంబర్ల వివరాలను అంతర్జాలంలో ఉంచుతారు. పైలట్ ప్రాజెక్టు పూర్తైనందున తొలి విడత సర్వే ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం, ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసే సరిహద్దు రాళ్లకు సంబంధించి. గ్రానైట్ పరిశ్రమల్లోని వృథాను వినియోగించనున్నారు.

వాటిని కొలతలు, గుర్తులవారీగా రాళ్లుగా కోసి సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం మడకశిర వద్ద ఓ స్థలాన్ని తీసుకునేందుకు జిల్లా కలెక్టర్ నుంచి గనులశాఖ అధికారులు అనుమతి పొందారు.పైలెట్ ప్రాజెక్టు కోసం జిల్లాకు ఒక డ్రోన్ మాత్రమే ఇవ్వగా.... తొలివిడత సర్వే కోసం అదనపు డ్రోన్ల అవసరం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ఇదీ చదవండి:

Vaccine Trials: 2-6ఏళ్ల వారికి రెండో డోసు ట్రయల్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.