కర్ణాటకలోని బళ్లారి నుంచి అక్రమంగా తరలిస్తున్న 40 మద్యం సీసాలను అనంతపురం జిల్లా ఉరవకొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని... ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. కర్ణాటకలో మద్యం రేట్లు తక్కువగా ఉండడం వల్ల అక్రమంగా మద్యాన్ని తరలించి రాష్ట్రంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సీఐ శ్యాంప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేసి... కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: కర్ణాటక మద్యం స్వాధీనం.. ఒకరి అరెస్టు