అనంతపురం జిల్లా పామిడి మండలం సొరకాయల పేట గ్రామం వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కర్ణాటక నుంచి రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. జిల్లాలో మద్యం విక్రయాలపై నిఘా ఉంచామని... అక్రమంగా మద్యం తరలిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు.
జిల్లాలోని నెమల్లపల్లి గ్రామానికి చెందిన బోయసాకే అంజనేయులు, అతని కొడుకు జనార్ధన్ కలిసి కర్ణాటక ప్రాంతం నుంచి 130 హైవార్డ్స్ ప్యాకెట్లు, 10 ఇతర రకమైన టెట్రా ప్యాకెట్లను అక్రమంగా తీసుకొస్తుండగా పట్టుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. నిందితులు నుంచి 140 మద్యం టెట్రా ప్యాకెట్లను, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:
ప్రేమ పెళ్లి చేసుకుంది..రాఖీ కట్టడానికి ఏడేళ్ల తర్వాత వస్తే కొట్టారు