అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని పామిడి సమీపంలో ఇసుకను అక్రమ రవాణాను స్థానికులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్న ముఠాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక నుంచి ఇసుక రీచ్‌ల వద్ద సాంకేతిక పరికరాలను అమర్చుతామని అధికారులు తెలిపారు. ఇసుక రీచ్‌ల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఇసుక రవాణా జరగాలని... రాత్రివేళలో రవాణా చేస్తే చర్యలు తప్పవని అన్నారు.
ఇదీ చూడండి: