అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం 74వ జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టకున్నారు. బెలుగుప్ప మండలం ఎన్.గుండ్లపల్లి గ్రామం నుంచి కర్ణాటకకు తరలిస్తుండగా పోలీసులు వాహనాన్ని గుర్తించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి.. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు రాయదుర్గం సీఐ ఈరన్న తెలిపారు.
ఇదీ చదవండి:
ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో చెక్పోస్ట్.. కరోనా కట్టడికి చర్యలు