అనంతపురం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సెబ్ అధికారులు అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. నగరంలోని పలు కాలనీల్లో అక్రమంగా నిల్వ చేసిన మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ ఇన్స్పెక్టర్ స్వర్ణలత తెలిపారు. సెబ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు మద్యం అక్రమంగా రవాణా చేసిన వారిపై 188 కేసులు నమోదు చేయడంతో పాటు 46 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. 198 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని, 127 మందిని బైండోవర్ చేసినట్లు తెలిపారు. పదేపదే నేరాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేశామన్నారు. మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కర్ణాటక మద్యం పట్టివేత
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 2,400 ప్యాకెట్ల కర్ణాటక మద్యాన్ని పోలీసులు పట్టుకున్నరు. కార్డన్ సెర్చ్ నిర్వహించగా మునెప్పనగర్లో ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని... ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి