అన్ని నియోజకవర్గాలలోప్రభుత్వం వెంటనే ఇసుక సరఫరా చేయాలంటూ అనంతపురం సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ డిమాండ్ చేశారు. ప్రభత్వ అసమర్థ విధానాలు, అలసత్వం వల్ల కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జిల్లాలో రెండు ప్రాంతాల్లో మాత్రమే ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేయడం వల్ల దూరప్రాంతల నుండి ఇసుకను రవాణా చేసుకోలేక బిల్డర్లు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇసుక సమస్యను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో ఈనెల 21న అన్ని నియోజకవర్గాల్లోని తమ పార్టీ నాయకులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు.
ఇదీచదవండి