అనంతపురంలోని శ్రీనివాస ఆస్పత్రి వద్ద ఓ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. శ్రీపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు భార్య రాధకు థైరాయిడ్ సమస్య ఉండగా.. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఒక రోజు గడిచినా.. రాధ స్పృహలోకి రాలేదు. బంధువులు వైద్యులను నిలదీశారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారని బంధువులు ఆరోపించారు.
ఈ క్రమంలో.. ఉదయం ఆమె మృతి చెందిందని చెప్పగా బంధువులు ఒక్కసారిగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళకు నలుగురు పిల్లలు ఉండగా.. వారు తల్లి లేని పిల్లలయ్యారంటూ బంధువుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆస్పత్రులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: