అనంతపురం జిల్లా కదిరి మండలం కమ్మరవాండపల్లి గుట్టలో ఏర్పాటు చేసుకున్న నివాసాలను...ముందస్తు సమాచారం ఇవ్వకుండానే కూల్చేశారంటూ బాధితులు వాపోతున్నారు. అద్దెలు కట్టలేక ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు 3 షెడ్లు, 6 పునాదులను జేసీబీతో కూల్చేశారని అన్నారు. నాలుగేళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను పడగొట్టి రోడ్డున పడేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: